హైదరాబాద్: 28°C
తెలంగాణ

పత్తి చేనులో గంజాయి సాగు.. రైతు అరెస్ట్

ASF: పత్తి చేను చాటున గంజాయి సాగు చేస్తున్న గిన్నెధరి గ్రామానికి చెందిన కొడప రవిని తిర్యాణి పోలీసులు అరెస్ట్ చేశారు. గుడిపేట శివారులోని పత్తి చేనులో సాగు చేస్తున్న 30 గంజాయి మొక్కలను సీజ్ చేశారు. వీటి విలువ సుమారు రూ. 3 లక్షలు ఉంటుందని తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. గంజాయి సాగు, విక్రయాలు, రవాణాపై కఠిన చర్యలు తీసుకుటామన్నారు.