హైదరాబాద్: 28°C
తెలంగాణ

సర్వసభ్య సమావేశానికి సర్పంచ్‌లు గైర్హాజరు

MLG: వెంకటాపుర్( M) మండల సర్వసభ్య సమావేశానికి 23 మంది సర్పంచులకు కేవలం 8 మంది మాత్రమే హాజరయ్యారు. అధికారులు అందరూ వచ్చిన ప్రజాప్రతినిధులు లేకపోవడంతో సమావేశం నామమాత్రంగా సాగింది. వరుసగా మూడు సమావేశాలకు ఇదే పరిస్థితి నెలకొనడంపై అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. పరిస్థితి ఇలానే కొనసాగితే ప్రజలకు పాలకులపై నమ్మకం లేకుండా పోతుందని అధికారులు ఆగ్రహాం వ్యక్తం చేశారు.