AKP: నాతవరం మండలం డీ.ఎర్రవరం సచివాలయాన్ని డిప్యూటీ ఎంపీడీవో ఏ.కూర్మారావు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్బంగా పింఛన్‌కు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ, ధ్రువీకరణను పరిశీలించారు. పింఛన్ దరఖాస్తుల కోసం ప్రజలు సచివాలయం వద్ద వేచి ఉండటంతో, సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తుల స్వీకరణ, ఆన్‌లైన్ ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
సచివాలయాన్ని సందర్శించిన డిప్యూటీ ఎంపీడీవో


