హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'స్ట్రీట్‌లైటింగ్ ప్రైవేటీకరణను నిలిపివేయాలి'

BPT: స్ట్రీట్‌ లైటింగ్ నిర్వహణ ప్రైవేటీకరణ జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో చీరాల మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ప్రైవేటీకరణ వల్ల ప్రజలపై ఛార్జీల భారం పడుతుందని, కార్మికుల ఉద్యోగ భద్రత దెబ్బతింటుందని నాయకులు వసంతరావు, ఇమ్మానియేల్ తెలిపారు. కార్మికులను పర్మినెంట్ చేయాలని, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.