హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో నూతన పింఛన్లకు 67,134 దరఖాస్తులు: కలెక్టర్

ATP: జిల్లాలో నూతన పింఛన్ల దరఖాస్తు గడువు ముగిసే సమయానికి ఆన్‌లైన్‌లో 67,134 అర్జీలు వచ్చాయని కలెక్టర్ ఓ. ఆనంద్ తెలిపారు. ఈ నెల 21లోగా సచివాలయ సిబ్బంది భౌతిక పరిశీలన పూర్తి చేయాలన్నారు. తహశీల్దార్లు, జిల్లా అధికారులు అర్జీలను పరిశీలించి ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు పంపాలని, సెప్టెంబర్ 24లోగా రాష్ట్ర అధికారులకు నివేదిక పంపాలని ఆదేశించారు.