హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డ్రోన్ ద్వారా జీవామృతం పిచికారీ

VZM: వరి పంటలో వచ్చే వివిధ రకాల తెగుళ్లు, పురుగుల నివారణకు రైతులు పలపత్ర ద్రావణాన్ని పిచికారీ చేయాలని ప్రకృతి వ్యవసాయ ఎఫ్‌ఎంటీ కిషోర్ కుమార్ సూచించారు. చీపురుపల్లి మండలం కర్లాం గ్రామంలోని 15 ఎకరాల వరి పొలాల్లో శుక్రవారం డ్రోన్ ద్వారా పలపత్ర, ద్రవ జీవామృతాన్ని పిచికారీ చేయించారు. ఈ కార్యక్రమంలో ఐసీఆర్‌పీలు, పలువురు రైతులు పాల్గొన్నారు.