హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఫ్లెక్సీ షాపు యజమాని ఆత్మహత్య

హన్మకొండ నగరంలోని నయీమ్‌నగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఫ్లెక్సీ షాపు యజమాని పెద్దబోయిన గణేష్ శుక్రవారం షాపులో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. గణేష్‌కు భార్య రమ్యశ్రీ, ఇద్దరు కుమార్తెలు తన్వి సాయిశ్రీ, సాన్విశ్రీ ఉన్నారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టి ఆత్మహత్యకు గల కారణాలను ఆరా తీస్తున్నారు.