హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విధులు బహిష్కరించిన న్యాయవాదులు

W.G: న్యాయవాదులపై దాడులను ఆపకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కామన మునిస్వామి హెచ్చరించారు. శుక్రవారం న్యాయవాదులు తణుకులో కోర్టు విధులను బహిష్కరించారు. అనంతపూర్ న్యాయవాదిపై సర్కిల్ ఇన్‌స్పెక్టర్ దాడి చేయడానికి వ్యతిరేకిస్తూ.. న్యాయవాదులు తణుకు బార్ అసోసియేషన్ ఎదుట ధర్నా చేశారు.