సత్యసాయి: పుట్టపర్తి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను స్వయంగా విన్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటామని ఎమ్మెల్యే తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పుట్టపర్తిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహణ


