హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా కుంకుమ పూజ కార్యక్రమం

BHPL: చిట్యాల మండల కేంద్రంలో గణేష్ వర్తక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం కుంకుమ పూజ, అన్న ప్రసాద వితరణ చేపట్టారు. మహిళలు భక్తిశ్రద్ధలతో పూజల్లో పాల్గొని కుటుంబాలు, వ్యాపారాలు సుభిక్షంగా ఉండాలని వినాయకుడిని ప్రార్థించారు. అనంతరం సుమారు 1,000 మందికి అన్న ప్రసాదం అందించారు. ఈ కార్యక్రమంలో మహిళ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.