హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వాకింగ్ ట్రాక్ పనులను పరిశీలించిన కమిషనర్

కాకినాడ: గొల్లప్రోలు పట్టణ బస్టాండ్ సమీపంలోని మొగలి సూర్యుడు చెరువు గట్టుపై జరుగుతున్న వాకింగ్ ట్రాక్ నిర్మాణ పనులను మున్సిపల్ కమిషనర్ దివిజ సంపతి శుక్రవారం పరిశీలించారు. సెప్టెంబర్ 21, 22 తేదీల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో పనులను వేగవంతం చేయాలని సిబ్బందికి సూచించారు. పట్టణంలో పారిశుధ్యం, ఇతర ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.