హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏజెన్సీలు మెనూ అమలు చేయడం లేదు: SFI

KMM: ప్రభుత్వ పాఠశాలలో మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అమలు చేయాలని SFI డివిజన్ అధ్యక్షుడు త్రినాథ్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఖమ్మంలోని పలు ప్రభుత్వ పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఏజెన్సీలు ఎక్కడ కూడా మెనూ అమలు చేయడం లేదని, పేరుకి మాత్రమే మెనూ చూపిస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.