హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉత్తమ ఉపాధ్యాయుడికి సన్మానం

MLG: కాటాపూర్‌ జడ్పీహెచ్‌ఎస్‌ ఫిజికల్‌ సైన్స్‌ ఉపాధ్యాయుడు సక్రు నాయక్‌ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికైన సందర్భంగా పంచాయతీ ఆధ్వర్యంలో సన్మానించారు. సర్పంచ్‌ దిడ్డి మోహన్‌రావు, కార్యదర్శి కోరం భాగ్యరాణి శాలువాతో సత్కరించారు. విద్యార్థుల అభివృద్ధికి ఆయన సేవలు అభినందనీయమన్నారు. కార్యక్రమంలో హెచ్‌ఎం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.