హైదరాబాద్: 28°C
తెలంగాణ

అథ్లెటిక్స్‌లో ప్రతిభ చాటిన గురుకుల పాఠశాల విద్యార్థిని

KNR: జమ్మికుంట మండలం నాగంపేట సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల విద్యార్థిని న్యాల సిరి జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్‌లో  ప్రతిభ చాటింది. పుదుచ్చేరిలో సెప్టెంబర్ 16 నుంచి 18 వరకు నిర్వహించిన 37వ సౌత్ జోన్ నేషనల్ ట్రయథ్లాన్–ఏ విభాగంలో 60 మీటర్ల రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్ పోటీల్లో పాల్గొని, సిల్వర్ మెడల్ సాధించింది. దీంతో సిరిని.. ప్రిన్సిపల్, పీఈటీలు అభినందించారు.