హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రైవేటు పాఠశాలలు నిబంధనలు పాటించాలి'

మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని ఆర్టిఐ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సాయి ప్రసాద్ రావు అన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని సంఘ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..పేద ప్రజల ఆర్థిక స్థితి గతులు పాఠశాలలు గమనించాలన్నారు.