హైదరాబాద్: 28°C
వార్తలు

పొటాష్‌తో అధిక దిగుబడి: ఏవో

SKLM: మెలియాపుట్టి మండలం బాణాపురం, పరశురాంపురం గ్రామాల్లో బుధవారం ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమం నిర్వహించారు. ఏవో దానకర్ణుడు వరి పొలాలను పరిశీలించి, పొటాష్ ఎరువు వాడితే రోగనిరోధక శక్తి పెరిగి దిగుబడి పెరుగుతుందని సూచించారు. పంట బీమా రైతులు ఈ-కేవైసీ, పంట నమోదు పూర్తిచేయాలని, ధాన్యం కొనుగోలుకు రైతు ఐడీ తప్పనిసరని తెలిపారు.