హైదరాబాద్: 28°C
తెలంగాణ

డ్రైనేజీ పనుల్లో అలసత్వంపై BRS కౌన్సిలర్ల ఆగ్రహం

WGL: నర్సంపేట బస్టాండ్ ప్రధాన రహదారిలో డ్రైనేజీ పనుల పేరుతో మురుగు, మట్టిని రోడ్లపై వదిలి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని BRS కౌన్సిలర్లు ఆరోపించారు. రూ.10 లక్షల టెండర్ల పనులు పైపైనే చేస్తున్నారని, వినాయక నవరాత్రుల వేళ పట్టణాన్ని అపరిశుభ్రం చేస్తున్నారని మండిపడ్డారు. పనులు వేగంగా పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పాల్గొన్నారు.