ADB: మహిళల సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ వహించి, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీసు అధికారులను ఆదేశించారు. శుక్రవారం వార్షిక తనిఖీల్లో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలోని ఉమెన్ పోలీస్ స్టేషన్‌ను ఆయన పరిశీలించారు. స్టేషన్‌లోని రికార్డులు, పెండింగ్ కేసులు, ఫిర్యాదుల పరిష్కారం, నిర్వహణ, పరిశుభ్రతను తనిఖీ చేశారు.
తెలంగాణ
మహిళా పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ


