హైదరాబాద్: 28°C
క్రీడలు

కీలక నిర్ణయాలు తీసుకున్న బీసీసీఐ

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వార్షిక సభ్య సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌కు BCCI జనరల్ బాడీ ఆమోదం తెలిపింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఆడిటర్లను నియమించింది. అలాగే, దేశవాళీ క్రికెట్‌లో పని చేస్తున్న అంపైర్లు, రిఫరీల వేతనాలను పెంచాలని ఈ సమావేశంలో బీసీసీఐ నిర్ణయించింది.