హైదరాబాద్: 28°C
క్రీడలు

ప్రభుత్వ నిర్ణయాలను ఫాలో అవ్వాలి: కపిల్ దేవ్

పాక్ ఆటగాళ్లతో కరచాలనంపై క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత ప్రభుత్వం ఏం చెబితే ప్లేయర్లు అదే చేయాలని తెలిపాడు. 'పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయొద్దని భారత ప్రభుత్వం నిర్ణయిస్తే.. టీమిండియా క్రికెటర్లు అదే చేయాలి. ప్రభుత్వం ఏది చెబితే దానినే పాటించాలి' అని పేర్కొన్నాడు. కాగా, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్ ప్లేయర్లతో భారత క్రికెటర్లు షేక్ హ్యాండ్ చేయడంలేదు.