హైదరాబాద్: 28°C
క్రీడలు

విధ్వంసం.. ట్రావిస్ హెడ్ ఫాస్టెస్ట్ సెంచరీ

జింబాబ్వేతో జరుగుతున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ విధ్వంసం సృష్టించాడు. ఆతిథ్య జట్టుపై కేవలం 74 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఈ శతకంతో తన 8వ వన్డే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. మొత్తంగా 84 బంతుల్లో 112 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే ఓ అరుదైన రికార్డును నమోదు చేశాడు. జింబాబ్వే తరఫున అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన ఆసీస్ ప్లేయర్‌గా నిలిచాడు.