హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహిళలకు క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు

AKP: అగనంపూడి హోమీ బాబా క్యాన్సర్ ఆసుపత్రి బృందం పాయకరావుపేట మండలం పాల్తేరులో శుక్రవారం వైద్య శిబిరం నిర్వహించింది. డాక్టర్ జీవన్ పర్యవేక్షణలో మహిళలకు నోటి, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లకు పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తామని వైద్యులు తెలిపారు.