హైదరాబాద్: 28°C
తెలంగాణ

లడ్డూ దక్కించుకున్న డీసీసీబీ వైస్ ఛైర్మన్

VKB: జిల్లాలోని తాండూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వినాయకుడి లడ్డూ వేలం పాట నిర్వహించారు. ఈ వేలంలో డీసీసీబీ వైస్ చైర్మన్ రవి గౌడ్ రూ.51 వేలతో లడ్డూను దక్కించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లడ్డూ దక్కించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరుకున్నారు.