హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీలో చేరిన 100 కుటుంబాలు

విజయనగరం పట్టణం 25వ డివిజన్లో మంగళ వీధికి చెందిన స్థానికులు ఎర్ర ఎర్రి నాయుడు, లక్ష్మి, ప్రశాంత్‌తో పాటు 100 కుటుంబాలు స్థానిక ఎమ్మెల్యే అదితి గజపతి ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రచారం చేయాలని సూచించారు.