హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మైదుకూరు అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి'

KDP: మైదుకూరు మున్సిపాలిటీలో అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్‌ శ్రీధర్‌ అధికారులను ఆదేశించారు. తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, వీధి దీపాలు తదితర అంశాలపై సమీక్షించారు. అమృత్‌ 2.0 కింద తాగునీటి పనులను వేగవంతం చేయాలని, చెత్త నిర్వహణను సమర్థవంతంగా చేపట్టాలని సూచించారు.