AKP: ఈనెల 21న మాడుగుల మండల సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో కొంకి అప్పారావు శుక్రవారం తెలిపారు. మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీపీ తాళపురెడ్డి వెంకట రాజారాం అధ్యక్షతన ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందన్నారు. ఎంపీటీసీలకు, ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 21న సర్వసభ్య సమావేశం


