హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ప్రభుత్వం'

GNTR: అగ్రిగోల్డ్ డిపాజిట్ల కుంభకోణానికి సంబంధించిన అంశాలపై సచివాలయంలో సహచర మంత్రులతో హోంమంత్రి వంగలపూడి అనిత సమీక్ష నిర్వహించారు. బాధితుల సమస్యలు, కేసుల ప్రస్తుత పరిస్థితి, వారికి న్యాయం జరిగేలా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో సమగ్రంగా చర్చించారు. అగ్రిగోల్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా తదుపరి కార్యాచరణపై దృష్టి సారించినట్లు తెలిపారు.