కృష్ణా: గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఎంపీ వల్లభనేని బాలశౌరి జన్మదిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నేతలు రోగులకు పండ్లు పంపిణీ చేశారు. గుడివాడ ప్రజల చిరకాల స్వప్నమైన ఫ్లైఓవర్ నిర్మాణానికి ఎంపీ బాలశౌరి ఎంతో కృషి చేశారని జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఏరియా ఆసుపత్రిలో ఎంపీ బాలశౌరి బర్త్‌డే


