ASR: పెన్షన్ ఆన్‌లైన్ విధానంలో కటాఫ్ తేదీ కారణంగా అర్హులైన లబ్ధిదారులు నష్టపోతున్నారని సీపీఎం జీకేవీధి మండల కార్యదర్శి బుజ్జిబాబు శుక్రవారం తెలిపారు. 50 ఏళ్లు నిండిన వారికి పలు ధ్రువపత్రాలు అవసరం కావడంతో, సకాలంలో దరఖాస్తు చేసుకోలేకపోతున్నారని చెప్పారు. కటాఫ్ తేదీ తొలగించి, పెన్షన్ దరఖాస్తు ప్రక్రియను నిరంతరం కొనసాగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్
'పెన్షన్ ప్రక్రియను నిరంతరం కొనసాగించాలి'


