హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోషకాహార సేవలపై అవగాహన

కృష్ణా: నందివాడ మండలం అరిపిరాల గ్రామంలో పోషణ మహోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐసీడీఎస్ సూపర్వైజర్ నాగశిరీష అధ్యక్షత వహించి, అంగన్వాడీ కేంద్రాల ద్వారా లబ్ధిదారులకు అందిస్తున్న పౌష్టికాహారం, పోషకాహార సేవలపై అవగాహన కల్పించారు. అంగన్వాడీ కేంద్రాల్లో మధ్యాహ్నం అందిస్తున్న భోజనం నాణ్యత, వారాంతపు మెనూ, పోషక విలువల గురించి వివరించారు.