హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాష్ట్ర స్థాయి పోటీలకు ఇద్దరు ఎంపిక

PPM: జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం పార్వతీపురంలోని ZPH పాఠశాలలో జిల్లా స్థాయి సైన్స్‌ సెమినార్‌ నిర్వహించారు. ‘ఇండియన్‌ ఎనర్జీ బాస్కెట్‌-2047’ అంశంపై జరిగిన పోటీలో జియ్యమ్మవలస మండలం బీజేపురం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి ఎం. లీలా గౌతమ్‌ ప్రథమ, కురుపాం జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని ఎం. శ్రావ్యశ్రీ ద్వితీయ స్థానాలు సాధించారు.