హైదరాబాద్: 28°C
తెలంగాణ

మోట్లపల్లిలో సీసీ కెమెరాలు

భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఐపీఎస్ ఆదేశాల మేరకు కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా మొగుళ్లపల్లి మండలం మోట్లపల్లి గ్రామంలో ప్రజల సహకారంతో 16 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. డీఎస్పీ సంపత్‌రావు రిబ్బన్ కట్ చేసి నిఘా వ్యవస్థను ప్రారంభించారు. సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల నివారణకు తోడ్పడుతుందని తెలిపారు.