హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొడాలి నాని సమక్షంలో వైసీపీలో భారీ చేరికలు

కృష్ణా: ప్రముఖ వ్యాపారవేత్త బొప్పన రామచంద్రరావు (రాము) వైసీపీలో చేరారు. ఆయనతో పాటు గుడ్లవల్లేరు మండలం పెంజండ్ర గ్రామానికి చెందిన పలువురు యువకులు పార్టీలో శుక్రవారం చేరారు. తన జన్మదినం సందర్భంగా పార్టీలో చేరిన రామచంద్రరావుకు కొడాలి నాని జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.