హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజ్‌మా సాగులో జాగ్రత్తలపై అవగాహన

ASR: జీకేవీధి మండలం డేరాలలో శుక్రవారం రాజ్‌మా సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏవో సురేష్ రైతులకు అవగాహన కల్పించారు. నేలను బాగా దున్ని ఎకరాకు 4టన్నుల పశువుల ఎరువు లేదా 2.5టన్నుల కంపోస్ట్ వేయాలన్నారు. విత్తనాలను బీజామృతంతో శుద్ధి చేసి, కిలోకు 8గ్రాముల ట్రైకోడర్మా విరిడీతో శుద్ధి చేస్తే తెగుళ్లను నివారించవచ్చన్నారు. రైజోబియంతో విత్తన శుద్ధి చేయాలన్నారు.