హైదరాబాద్: 28°C
తెలంగాణ

5 వార్డుల్లో సీసీ రోడ్లకు శంకుస్థాపన: ఎమ్మెల్యే

RR: ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని 5 వార్డుల్లో రూ.2 కోట్ల వ్యయంతో చేపడుతున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి శనివారం శంకుస్థాపన చేయనున్నారు. 8, 9, 10, 11, 12వ వార్డుల్లోని కాలనీల్లో రహదారుల అభివృద్ధికి ఈ నిధులు వెచ్చించనున్నారు. ఉదయం 11 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరు కావాలన్నారు.