హైదరాబాద్: 28°C
తెలంగాణ

కోలుకొండ గుట్టలో యువకుడి మృతదేహం

JN: దేవరుప్పుల మండలం కోలుకొండ గుట్టలో పాలకుర్తి మండలం బికియా నాయక్ తండాకు చెందిన ప్రేమకుమార్ (25) శుక్రవారం మృతదేహం లభించింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఇంటి నుంచి వెళ్లిపోయిన ప్రేమకుమార్ రెండు రోజుల క్రితం జనగామ బస్టాండ్ ప్రాంతంలో కనిపించినట్లు స్థానికులు తెలిపారు. అనంతరం కోలుకొండ గుట్టలో మృతదేహంగా కనిపించడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.