HYD: GHMC ప్రధాన కార్యాలయం ఎదుట స్వచ్ఛ ఆటో కార్మికులు ఆందోళన చేపట్టారు. కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తోపులాట జరగగా కార్మిక నాయకుడు గోపాల్ నాయక్ స్పృహ కోల్పోవడంతో నిమ్స్‌కు తరలించారు. ఇంటింటి చెత్త సేకరణను రాంకీ సంస్థకు అప్పగించే నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేశారు.
తెలంగాణ
GHMC ముట్టడికి యత్నం.. పలువురి అరెస్ట్


