AKP: పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయాలని సీపీఎం డిమాండ్ చేసింది. రాంబిల్లిలో రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. సీపీఎం జిల్లా నేతలు ఆర్. శంకర్‌రావు, దేముడు నాయుడు మాట్లాడుతూ.. బియ్యం, పంచదార, బెల్లం, పప్పులు, నూనె, ఉల్లిపాయ తదితర వస్తువుల ధరలు భారీగా పెరిగాయని అన్నారు. ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్
'నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించాలి'


