హైదరాబాద్: 28°C
తెలంగాణ

జీఓ 97ను వ్యతిరేకిస్తూ వినూత్న నిరసన

SRCL: వేములవాడ అర్బన్ మండలం అగ్రహారంలోని శ్రీ రాజరాజేశ్వర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో శుక్రవారం స్థానిక జేఏసీ ఆధ్వర్యంలో అధ్యాపకులు, సిబ్బంది జీఓ 97ను వ్యతిరేకిస్తూ మధ్యాహ్న భోజన విరామ సమయంలో వినూత్న నిరసన చేపట్టారు. వెనుకకు నడుస్తూ నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఆర్‌ఆర్‌ఎస్–లోకల్ జేఏసీ సభ్యులు, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.