MDK: ముప్పిరెడ్డిపల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై ఐటీసీ సంస్థకు చెందిన లోడు ట్రక్కు అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో రహదారి ఖాళీగా ఉండటంతో ఎలాంటి ప్రాణనష్టం జరగక ప్రమాదం తప్పినట్లయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని బోల్తా పడిన వాహనాన్ని పక్కకు తొలగించి, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
తెలంగాణ
తప్పిన పెద్ద ప్రమాదం


