హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నూతన పింఛన్లపై కలెక్టర్ కీలక ఆదేశాలు

NTR జిల్లా కలెక్టర్ డాక్టర్ జీ. లక్ష్మీశ నూతన పింఛన్ దరఖాస్తుల పరిష్కారంపై సమీక్షించారు. సెప్టెంబర్ 18తో గడువు ముగియనున్నందున, అర్హత కలిగిన దరఖాస్తులనునిబంధనల మేరకు వెంటనే ఆన్‌లైన్‌లో ఆమోదించాలని ఆదేశించారు. పింఛన్ల మంజూరులో జాప్యం చేసినా, డబ్బులు డిమాండ్ చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ అందేలా చూడాలని అన్నారు.