హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్కూటీని తొక్కేసిన టిప్పర్.. భయానక దృశ్యం

PLD: పిడుగురాళ్ల ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఎదుట శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో రామకృష్ణ అనే వ్యక్తి మృతి చెందాడు. స్కూటీపై వెళ్తున్న అతడిని టిప్పర్‌ లారీ ఢీకొనడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు పెదనెమలిపురి గ్రామానికి చెందినవాడిగా గుర్తించారు. ఘటన స్థలానికి చేరుకున్న SI శివ నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.