హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రగతి ధర్మారంలో పోషణ మాసం ఉత్సవాలు

MDK: ప్రగతి ధర్మారం గ్రామంలో పోషణ మాసం ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. స్థానిక సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన అలవాట్లు పాటించాలని సూచించారు. ఈ ఉత్సవాల్లో అంగన్‌వాడీ టీచర్లు, ఆర్‌పీలు, చిన్నారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.