AKP: అచ్యుతాపురం మండలం అందలాపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో ఇవాళ పోషణ మాసోత్సవం నిర్వహించారు. అంగన్‌వాడీ కాండ్రేగుల హేమలత ఆధ్వర్యంలో గర్భిణులు, బాలింతలకు చిరుధాన్యాల ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు, సామలు, అరికెలతో చేసిన వంటకాలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తల్లులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ మాసోత్సవం


