హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మినీ రిజర్వాయర్‌‌లో నీటి నిల్వల పరిశీలన

ASR: డుంబ్రిగుడ మండలం కొర్రాయి మినీ రిజర్వాయర్‌ను ఎస్‌ఎంఐ డివిజన్ ఈఈ రాజేంద్రకుమార్ శుక్రవారం పరిశీలించారు. రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం, నీటి విడుదల వ్యవస్థలను తనిఖీ చేశారు. రెండు తూముల ద్వారా 114ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతోందన్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా నీటి సరఫరాను పర్యవేక్షిస్తున్నామన్నారు. నీటిని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు.