హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆరుతడి విత్తనాలు పంపిణీకి సిద్ధం

AKP: కోటవురట్ల మండలంలో రైతులకు పంపిణీ చేయడానికి ఆరుతడి పంటల విత్తనాలను సిద్ధం చేశారు. వర్షాభావ పరిస్థితులు కారణంగా మండలంలో 25 శాతం లోపు మాత్రమే రైతులు వరి నాట్లు వేయగలిగారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆరుతడి పంటలను ప్రోత్సహిస్తుంది. ఉలవలు, జనుము, రాగి పంటలను 110 హెక్టార్ల విస్తీర్ణంలో వేయడానికి 20 క్వింటాళ్ల విత్తనాలను సిద్ధం చేసామని ఏఓ సరోజిని తెలిపారు.