హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బార్'

కోనసీమ: ప్రజా సమస్యల పరిష్కారం లక్ష్యంగా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కొత్తపేట ఎమ్మెల్యే  బండారు సత్యనందరావు అన్నారు. గోపాలపురం పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజాదర్బార్లో ఎమ్మెల్యే ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రతి సమస్యపై కూలంకషంగా చర్చించారు. ప్రజల సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.