హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రిక్షా కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి'

AKP: ఎస్ రాయవరం మండలం అడ్డరోడ్డులో రిక్షా కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని శ్రీ అభయాంజనేయ రిక్షా పుల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీర్రాజు కోరారు. 50 ఏళ్లుగా సుమారు 30 కుటుంబాలు రిక్షాలపై ఆధారపడి జీవించేవని తెలిపారు. ఆటోల రాకతో రిక్షాలకు బేరాలు తగ్గి ఉపాధి దెబ్బతిందన్నారు. సరుకుల రవాణా రిక్షాలుగా మార్పు చేసినా పనులు లభించడం లేదన్నారు.