హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గోతులమయంగా అట్ల ప్రగడ రహదారి

NTR: అట్ల ప్రగడ గ్రామానికి వెళ్లే రహదారి అధ్వానంగా మారింది. అడుగడుగునా గోతులు, రోడ్డుకు అడ్డంగా చెట్లతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రివేళల్లో ఈ రహదారి మరింత ప్రమాదకరంగా మారుతోందన్నారు. అధికారులు, రాజకీయ నాయకులు సమస్యను పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాలు జరిగే వరకు స్పందించరా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.