అన్నమయ్య: పీలేరు నియోజకవర్గంలోని కావిల్పిల్లి, బోడుమల్లువారిపల్లిలో కలెక్టర్ నిశాంతకుమార్ పర్యటించారు. బోడుమల్లువారిపల్లిలో రైతు పంట పొలాన్ని పరిశీలించిన కలెక్టర్.. రసాయనిక పదార్థాలను వినియోగించకుండా అంతర పంటల సాగు ద్వారా పొందుతున్న ప్రయోజనాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతులతో కలిసి మొక్కజొన్న, వరి, రాగులు, సజ్జలు, తదితర పంటల విత్తనాలను చల్లారు.
ఆంధ్రప్రదేశ్
రైతులతో కలిసి విత్తనాలు చల్లిన కలెక్టర్


